Schools and Colleges Holidays : బ్రేకింగ్ న్యూస్‌.. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు బంద్‌.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : వివిధ కార‌ణాల‌తో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు భారీగా వ‌స్తున్నాయి. ఇటీవ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడులో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీ వ‌ర్షాల‌తో సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఇప్పుడు మ‌రోసారి భారీ వర్షాలు విడిచిపెట్టడం లేదు. మొన్నటి దాకా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు ప్రస్తుతం దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్నాయి.

తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, టెన్‌కాశి జిల్లాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ప్రభుత్వం ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలతో పాటు బ్యాంకులు,ప్రైవేటు సంస్థల ఆఫీసులకు సెలవు ప్రకటించింది. అలాగే ఈ వ‌ర్షాలు ఇలాగే కొన‌సాగితే స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇంకా పొడిగించే అవ‌కాశం ఉంది.

☛ AP Sankranthi Holidays List 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్రాంతి పండ‌గకు మొత్తం సెల‌వులు ఎన్ని రోజులంటే..?

ఈ రాష్ట్రాల్లో కూడా..

దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి అక్కడి పరిస్థితి గందరగోళంగా తయారైంది. పలు చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచి రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దక్షిణ తమిళనాడులోని జిల్లాలతో పాటు దక్షిణ కేరళ, లక్షద్వీప్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ‘కన్యాకుమరి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెన్‌కాశీ  జిల్లాల్లో భారీ వర్షాల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(ఎస్డీఆర్‌ఎఫ్‌)కు చెందిన 250 మంది సిబ్బందిని సహాయక చర్యల కోసం నియమించాం’ అని తమిళనాడు రెవెన్యూ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ మంత్రి రామచంద్రన్‌ తెలిపారు. 

                                              

భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వానలతో దక్షిణ తమిళనాడుకు చెందిన తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి.

☛ TS Teacher Jobs Notification : తెలంగాణ‌లో 20,740 టీచర్ ఉద్యోగాలు ఖాళీలు.. నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..?

నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను స్టాలిన్‌ ఆదేశించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొన్ని జిల్లాల్లో..

ప్రస్తుతం భారీస్థాయిలో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలను మోహరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ నెల ప్రారంభంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరైంది. దాని నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. తూత్తుకుడిలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను దారి మళ్లించారు. మరికొన్ని సర్వీసులను రద్దు చేశారు. వందేభారత్ సహా 17 రైళ్లు రద్దయ్యాయి. ఈ వ‌ర్షప్ర‌భావం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది.

☛ AP 10th Class Public Exams Time Table 2024 : ఏపీ టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

 AP Inter Public Exams Time Table 2024 : ఏపీ ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల టైమ్ టేబుల్ ఇదే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

#Tags