Gurukul Entrance Exam: ఈనెల 25న ప్రవేశ పరీక్ష.. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ ఇలా..

గురుకుల ప్రవేశానికి పరీక్షల నిర్వహణ ఈ నెల 25న జరిపించనున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్‌ను విద్యార్థులు ఇక్కడ ప్రకటించిన సైట్‌లో డౌన్‌టోడ్‌ చేసుకోవచ్చు..

 

తుని రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 25న పరీక్ష జరుగుతుందని కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ హేమలత ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. 5, 6, 7, 8 తరగతులు, (ఏపీఆర్‌ఎస్‌ సెట్‌ 2024) విద్యార్థులకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.

Online Applications: జూనియర్‌ కళాశాలల పథకానికి దరఖాస్తులు ఆహ్వానం..

కళాశాలలకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమ ఐడీ, పుట్టిన తేదీతో aprs.apcfss వైబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిజిల్లాలో అభ్యర్థులు హాల్‌టికెట్లతో పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలన్నారు.

AP Inter Colleges Reopen: జూన్‌ 1న కళాశాలలు పునఃప్రారంభం.. వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసిన ఇంటర్‌ బోర్డు

#Tags