Diploma Courses: డిప్లొమా కోర్సులకు పాలిసెట్‌ తప్పనిసరి.. శిక్షణ కాలం..!

విద్యార్థులు తమ పదో తరగతి పూర్తి చేసుకున్న అనంతరం ఈ పరీక్ష రాస్తే కోర్సుల్లో శిక్షణ పొంది ఉద్యోగ, ఉపాధి అవకాశం పొందవచ్చని తెలిపారు..

అనంతపురం: డిప్లొమా కోర్సులకు డిమాండ్‌ భారీగా పెరిగింది. ఈ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పూర్తయిన విద్యార్థులు పాలిసెట్‌ రాయాల్సి ఉంటుంది. ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. విద్యార్థులకు ఆసక్తి ఉన్న ఏ కోర్సులోనైనా చేరి ఇష్టంగా చదివితే ఉజ్వల భవిత ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Telangana Inter Results Updates: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన

చిరుప్రాయంలోనే పాతిక వేల జీతం

పాలిటెక్నిక్‌ కోర్సులు పూర్తిచేసిన వారికి తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. దీంతో 20 సంవత్సరాల్లోపే రూ.25 వేల జీతం వచ్చే ఉద్యోగ అవకాశాలున్నాయి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పారిశ్రామిక అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ విస్తృత చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. కియా లాంటి అంతర్జాతీయ పరిశ్రమలతో పాటు కేంద్ర ప్రభుత్వ అనుబంధ పరిశ్రమలూ ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాలిటెక్నిక్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశంపై ఫుల్‌ గ్యారంటీ ఉంటోంది. ఇప్పటికే డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు కియాతో పాటు దాని అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తుండడమే ఇందుకు నిదర్శనం.

TS Inter Results: 22న ఇంటర్‌ ఫలితాలు!.. ఇంటర్‌ తర్వాత చదవడానికి అవకాశం ఉన్న టాప్‌ 100 కోర్సులు

ర్యాంక్‌ల ఆధారంగా సీటు

డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ముందుగా పాలిసెట్‌ రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన ర్యాంక్‌ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీటు రావాలంటే గణనీయమైన ర్యాంకు తప్పనిసరి. ఈ క్రమంలో పాలిసెట్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ర్యాంకు దక్కించుకునేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పాలిటెక్నిక్‌ కళాశాల అధ్యాపకులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వేసవి సెలవులు వృధా కానివ్వకుండా విద్యార్థులకు ఉచిత శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక తర్ఫీదునిస్తున్నారు.

IIIT Hyderabad: ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌కు దేశంలోనే రెండవ స్థానం

పదో తరగతి పూర్తయిన వెంటనే పోటీ పరీక్షలు రాయాలంటే అందుకు కావాల్సిన సంసిద్ధత ఉండేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీస్తున్నారు. ఈ నెల 1న ప్రారంభమైన శిక్షణా తరగతులు 25 తేదీ వరకూ కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఉన్న ప్రతి చోటా ఈ శిక్షణా తరగతులు కొనసాగేలా అధ్యాపకులు చొరవ తీసుకోవడం గమనార్హం. అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 244 మంది విద్యార్థులు శిక్షణకు హాజరవుతున్నారు. అనంతపురం పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి.జయచంద్రారెడ్డి పర్యవేక్షణలో జిల్లాలోని ఉచిత శిక్షణా కేంద్రాలకు కో–ఆర్డినేటర్‌గా డాక్టర్‌ ఎం.రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు.

UPSC Civils 6th Ranker Srishti Dabas Sucess Story: ఉద్యోగం చేస్తూనే, రాత్రిపూట చదువు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 6వ ర్యాంకు

అనంతపురం పాలిటెక్నిక్‌ కళాశాలకు అధిక డిమాండ్‌

అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా కోర్సులకు అధిక డిమాండ్‌ ఉంది. ఇటీవలే ఎన్‌బీఏ (నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్స్‌) గుర్తింపు దక్కడంతో ఇక్కడ సీటు దక్కించుకోవాలంటే గణనీయమైన ర్యాంక్‌ సాధించాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్‌, ఈసీఈ, ఆటోమొబైల్స్‌, సివిల్‌, మెకానికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కియా ట్రైనింగ్‌ సెంటర్‌ ఉండడంతో ఇక్కడ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు తక్షణ ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లోనూ సింహ భాగం ఇక్కడి విద్యార్థులకు ఉద్యోగాలు దక్కాయి. హాస్టల్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయాలు ఉన్నాయి. డిప్లొమా పూర్తి చేసిన వారు ఇంజినీరింగ్‌ కోర్సులో నేరుగా రెండో సంవత్సరం చేరడానికి అవకాశం ఉంది.

Jobs at 108 Service: 108లో ఉద్యోగాలకు దరఖాస్తులు

పాలిసెట్‌ పరీక్ష ఇలా

పాలిసెట్‌ పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో గణితం 50, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు ఉంటుంది. పదో తరగతి సిలబస్‌ ఆధారంగా ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. పాలిసెట్‌లో కనీసం 35 మార్కులు సాధించాలి.

#Tags