Diploma Course: డిప్లొమాతో ఎన్నో ఉద్యోగ అవకాశాలు, క్యాంపస్‌ సెలక్షన్స్‌లోనూ..

పుత్తూరు: డిప్లొమా కోర్సు చదవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూడీసీ) ఈఈ రవీంద్రబాబు తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌ అచీవర్స్‌ డే సెలబ్రేషన్స్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ డిప్లోమా పూర్తి చేయడం ద్వారా ఇంజినీరింగ్‌ రంగంలో మెరుగ్గా రాణించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కూడా క్యాంపస్‌ సెలక్షన్స్‌ ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు.

Benefits of Taking MPC course in Inter : ఇంట‌ర్‌లో ఎంపీసీ కోర్సు తీసుకుంటే..ఉండే ఉప‌యోగాలు ఇవే..! ఎంపీసీ వైపే ఎక్కువ మంది.. ఎందుకంటే..?

కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్వీ కుమార్‌ మాట్లాడుతూ ఈ అకడమిక్‌ ఇయర్‌లో వివిధ పెద్ద కంపెనీల ద్వారా నిర్వహించిన క్యాంపస్‌ సెలక్షన్స్‌లో తమ కళాశాల నుంచి 62 మంది విద్యార్థులు వివిధ ఉద్యోగాలకు ఎంపికై నట్లు తెలిపారు.

అనంతరం రవీంద్రబాబు చేతుల మీదుగా విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏపీఈడబ్ల్యూడీసీ డీఈ బాలసుబ్రమణ్యం, కళాశాల విభాగాధిపతులు కిషోర్‌కుమార్‌, వేలాయుధాచారి, రామకృష్ణరావు, సుగుణ, జయచంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.
 

#Tags