CM Revanth Reddy US Tour: తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 30,750 ఉద్యోగాలు.. 19 కంపెనీలతో ఒప్పందాలు

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ఉన్నతాధికారులతో కూడిన రాష్ట్ర బృందం అమెరికాలో చేపట్టిన పర్యటన ముగిసింది. ఈ నెల 3న అమెరికా వెళ్లిన సీఎం బృందం.. అక్కడి నుంచి దక్షిణకొరియాకు బయలుదేరింది. అమెరికా పర్యటనలో భాగంగా వివిధ రంగాల్లో పేరొందిన దిగ్గజ కంపెనీలు తెలంగాణలో రూ.31,532 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

19 కంపెనీలు.. 30వేలకు పైగా ఉద్యోగాలు
రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు 19 కంపెనీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని.. తద్వారా రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. ఫ్యూచర్‌ స్టేట్‌గా తెలంగాణను, 4.0 నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్న సీఎం చేసిన ప్రకటనలతో అమెరికా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు ఆసక్తి చూపారని వెల్లడించాయి.

Engineering Colleges in Telangana : 69 శాతం ఇంజినీరింగ్ క‌లేజీలు ఈ జిల్లాల్లోనే.. కోర్ బ్రాంచ్‌ల‌పై అవ‌గాహ‌న..

దిగ్గజ సంస్థలు కాగ్నిజెంట్, చార్లెస్‌ స్క్వాబ్, ఆర్సీసియం, కార్నింగ్, ఆమ్‌జెన్, జొయిటిస్, హెచ్‌సీఏ హెల్త్‌కేర్, వివింట్‌ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్‌ ఈక్విటీ, ట్రైజిన్‌ టెక్నాలజీస్, మోనార్క్‌ ట్రాక్టర్‌ కంపెనీలు ప్రభుత్వంతో పనిచేసేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. 

Success Stroy : ఎలాంటి కోచింగ్ లేకుండానే.. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. కానీ నా ల‌క్ష్యం ఇదే..

 
హైదరాబాద్‌లో అమెజాన్‌ సేవల విస్తరణ 
అమెజాన్‌ సంస్థ హైదరాబాద్‌లోని తమ డేటా సెంటర్‌ను విస్తరించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది.అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌కు సంబంధించి హైదరాబాద్‌లో ఇప్పటికే మూడు డేటా సెంటర్లు ఉన్నాయి. తాజాగా ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారిత సేవలతో కొత్త హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ను, తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలను అమెజాన్‌ ప్రతినిధులు వివరించారు. 

 

#Tags