CBSE CTET Admit Card 2024: సీటెట్‌ హాల్‌టికెట్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

సెంట్రల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(CTET) అడ్మిట్‌కార్డులను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌  ctet.nic.in నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఈనెల 7న దేశ వ్యాప్తంగా 136 నగరాల్లో సీటెట్‌ పరీక్షను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ ప‌రీక్ష 20 భాషల్లో ఉంటుంది. సీటెట్‌ స్కోర్‌తో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.

సీటెట్‌ స్కోరు..  ఎంతకాలం ఉంటుందంటే..
సీటెట్‌ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధనకు పేపర్‌-1కు హాజరు కావలసి ఉంటుంది. అదేవిధంగా ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు టీచింగ్‌కు పేపర్‌-2లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.రెండు స్థాయిల్లోనూ బోధించాలనుకునే వారు రెండు పేపర్లకు హాజరై ఉత్తీర్ణత సాధించాలి.

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌)పరీక్షలో సాధించిన ఉత్తీర్ణ‌త ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు లైఫ్‌లాంగ్‌ వ్యాలిడిటీ ఉంటుంది.

CBSE CTET Admit Card 2024.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ ctet.nic.inను క్లిక్‌ చేయండి. 
  • హోంపేజీలో కనిపిస్తున్న CTET Admit Card అనే లింక్‌పై క్లిక్‌ చేయండి. 
  • లాగిన వివరాలను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి
  • తర్వాతి స్క్రీన్‌లో మీకు అడ్మిట్‌ కార్డు డిస్‌ప్లే అవుతుంది.. భవిష్యత్‌ అవసరాల కోసం డౌన్‌లోడ్‌ చేసుకోండి

#Tags