Campus Recruitment Drive: ఐటీఐ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఈనెల 28న క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌

కాకినాడ సిటీ: ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎంవీజీ వర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

AP TET 2024 Results: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఐటీఐ ఫైనల్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మెదక్‌, హైదరాబాద్‌, తుని ప్రాంతాలకు చెందిన ఐటీసీ లిమిటెడ్‌, ఏపీ ఇంజినీరింగ్‌, లిఫ్ట్‌ మెకానికల్‌, రానే బ్రేక్‌ లివింగ్‌ లిమిటెడ్‌, అరబిందో ఫార్మా తదితర కంపెనీల్లో ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని వివరించారు. అన్ని ట్రేడుల విద్యార్థులూ ఇందులో పాల్గొనవచ్చని, ఆసక్తి ఉన్న వారు తమ బయోడేటాతో హాజరు కావాలని వర్మ కోరారు.

#Tags