Kitchen Gardens: పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు.. విద్యార్థులకు అవగాహన సదస్సు..!
చిలకలపూడి: పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు ద్వారా విద్యార్థి దశ నుంచే ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో విద్యాశాఖ అనుబంధ శాఖల అధికారులు, ఉద్యాన, ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులతో గురువారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. భావితరాలు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేపట్టి న్యూట్రిషన్ పోషక విలువలు కలిగిన ఆహారం సమాజానికి అందించాలని కోరారు.
Job Opportunities : కెమికల్ ఇంజినీరింగ్‌లో విస్తృత అవకాశాలు..
ఈ లక్ష్యంతో పాఠశాల విద్య సంబంధిత శాఖలు, ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన శాఖల సహకారంతో పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుకు ప్రోత్సహించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో 119 ఆర్బీకేల పరిధిలో గల పాఠశాలల్లో రిసోర్స్ పర్సన్స్ ద్వారా న్యూట్రి గార్డెన్స్ పట్ల తగిన తర్ఫీదు ఇవ్వాలని పేర్కొన్నారు. డీఈవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఈవో తాహెరా సుల్తానా, జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి, నాచురల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి, సూక్ష్మ సేద్య ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి, డీడీ తదితరులు పాల్గొన్నారు.