Bridge Course: బ్రిడ్జ్ కోర్సుకు దరఖాస్తు చేసుకోండి
ఐటీఐలో రెండేళ్ల ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు బ్రిడ్జ్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కన్వీనర్, నిజామాబాద్ ఐటీఐ (బాలుర) ప్రిన్సిపాల్ ఎం.కోటిరెడ్డి డిసెంబర్ 28(గురువారం) ఓ ప్రకటన లో తెలిపారు.
ఆసక్తిగల అభ్యర్థులు రెండేళ్ల ఐటీఐ కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. కోర్సుకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదువుకోవాలని తెలిపారు. శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులను నగరంలోని బాలుర ఐటీఐలో సమర్పించాలని సూచించారు.పూర్తి వివరాలకు 94417 84849 నంబరును సంప్రదించాలన్నారు.
Bridge Course: బ్రిడ్జి కోర్సు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
#Tags