AP Govt Schools: ఉపాధ్యాయులూ జాగ్రత్త!

అనంతపురం ఎడ్యుకేషన్‌: నేటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కావడంతో బడులు మూతపడనున్నాయి. ప్రతి పాఠశాలలోనూ లక్షలాది రూపాయల విలువ చేసే ఖరీదైన సామగ్రి ఉన్న నేపథ్యంలో సంబంధిత హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉంటూ వాటిని దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని విద్యాశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి వి.నాగరాజు జిల్లాలోని ఎంఈఓలు, హెచ్‌ఎంలకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

చ‌ద‌వండి: School Games Federation: ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో విద్యార్థుల సత్తా

విద్యాశాఖలో సంస్కరణలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా మానవ వనరులను తయారు చేయడానికి, కార్పోరేట్‌ స్థాయి విద్య అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ‘మనబడి నాడు నేడు‘ అనే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగానే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పాఠశాలల రూపురేఖలు మార్చింది. విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థమయ్యేలా సాంకేతికతను జోడించి ‘డిజిటల్‌ విద్యను’ తీసుకొచ్చింది.

1595 ఇంటరాక్ట్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌
జిల్లాలో గతేడాది 8వ తరగతి విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులకు సుమారు 25,470 ట్యాబ్‌లు ఇచ్చారు. ‘నాడు నేడు’ ఫేజ్‌–1 కింద పూర్తయిన 534 పాఠశాలలకు ఒక్కొక్కటి రూ. 1.35 లక్షలు విలువచేసే 1,595 ఇంటరాక్ట్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌, ఒక్కొక్కటి రూ. లక్ష విలువచేసే 759 స్మార్ట్‌ టీవీలను సరఫరా చేశారు. ఇంతటి విలువైన వస్తువులపై
సెలవు దినాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డీఈఓ వి.నాగరాజు ఆదేశించారు.

చ‌ద‌వండి: Children's Day Celebration: 26 నుంచి బాలల దినోత్సవ పోటీలు

ప్యానల్స్‌, స్మార్ట్‌ టీవీల నిర్వహణ

  • లక్షలు విలువ చేసే ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులదే. ప్రతి పాఠశాలలో విలువైన సామగ్రిని కాపాడుకోవడానికి భద్రతా చర్యలు తీసుకోవాలి.
  • సెలవు దినాల్లో ప్రతి ఎలక్ట్రానిక్‌ వస్తువుకు పవర్‌ సప్లయ్‌ ఆఫ్‌ చేసి, పవర్‌ సప్లయ్‌ ప్లగ్‌ నుంచి వైర్లను వేరుచేయాలి.
  • ప్రతి పాఠశాలలోనూ విలువైన వస్తువుల వివరాలను నమోదు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌, సచివాలయంలో అందజేసి సెలవు దినాల్లో పోలీసులు పర్యవేక్షించేలా చూడాలి.
  • సెలవు దినాల్లో ప్రతి విద్యార్థి ట్యాబ్‌ను సక్రమంగా ఉపయోగించుకొనేలా చూడాలి. ట్యాబ్‌లో మూడు యాప్‌లు వచ్చేలా అప్‌డేట్‌ చేయించాలి. తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలి.

#Tags