Andhra University: అంతర్జాతీయ వర్సిటీలకు దీటుగా ఏయూ
ముందుగా తాను చదువుకున్న ఏయూ వాతావరణ శాస్త్ర విభాగాన్ని సందర్శించి, అక్కడ ఆచార్యులతో కొద్దిసేపు సంభాషించారు. ఏయూ వాతావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశోధనలు, వసతులు పరిశీలించారు. అనంతరం వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా విజయ్ తల్లాప్రగడ మాట్లాడుతూ అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాలైన ఎంఐటీ, హార్వర్డ్ వర్సిటీల తరహాలో ఏయూ అభివృద్ధి సాధిస్తోందన్నారు. తన విజయానికి బలమైన పునాదులు ఇక్కడే పడ్డాయని, వర్సిటీకి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. అనంతరం వర్సిటీ తరఫున అతన్ని వీసీ ప్రసాదరెడ్డి సత్కరించారు. పాలకమండలి సభ్యులు, ఏయూ వాతావరణశాస్త్ర విభాగాధిపతి ఆచార్య పి.సునీత, రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Andhra Pradesh Jobs 2024: ఆస్పత్రుల్లో 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఇదే చివరి తేదీ..!