All Educational Institutions Holiday : గుడ్‌న్యూస్‌.. జనవరి 22 అన్ని విద్యాసంస్థలకు సెలవు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ ఏడాది స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా సెల‌వులు రానున్నాయి. పండ‌గ‌లు, బంద్‌లు, వ‌ర్షాలు, చ‌లికాలం సెల‌వులు ఇలా.. ఎన్నో ర‌కాల స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇస్తున్నారు. ఈ జ‌న‌వ‌రి నెల‌లోనే స్కూల్స్‌, కాలేజీల‌కు సంక్రాంతి సెల‌వులు భారీగా ఉన్న విష‌యం తెల్సిందే.

ఇప్పుడు తాజాగా జనవరి 22వ తేదీన‌ ఉత్తరప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. జ‌న‌వ‌రి 22వ తేదీన‌ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం దృష్టా  రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.

☛ School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవులు పొడిగింపు.. ఎన్నిరోజులో తెలుసా..

ఆ రోజు అన్ని ప్రభుత్వ..
అదే విధంగా జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని ముఖ్య‌మంత్రి తెలిపారు. ఆ రోజు అన్ని ప్రభుత్వ భవనాలను సుందరంగా అలంకరించాలని, బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని సీఎం ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. అయోధ్యలో జనవరి 22వ తేదీన‌ నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులను, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించారు. కాశీ విశ్వనాథుని ఆలయం, మాతా వైష్ణో దేవి ఆలయ ప్రతినిధులు, ఇస్రో శాస్త్రవేత్తల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. సినీ పరిశ్రమ, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు.

 Inter Colleges Sankranthi Holidays 2024 : జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్‌ బోర్డు.. మొత్తం ఎన్నిరోజులంటే..?

ఇత‌ర రాష్ట్రాల్లో కూడా..
అలాగే ఇత‌ర రాష్ట్రాల ప్ర‌భుత్వాలు జ‌న‌వ‌రి 22వ తేదీ స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇంకా దీని ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లే. కొన్ని హిందూ సంఘాలు జ‌న‌వ‌రి 22వ తేదీన స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవ్వ‌ల‌ని డిమాండ్ చేస్తున్నారు.

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే..
☛ 15-01-2024న (సోమవారం) సంక్రాంతి
☛ 16-01-2024న (మంగళవారం) కనుమ
☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

#Tags