Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్ : మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2024 – 25 విద్యా సంవత్సరంలో 5 నుంచి 8వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మైమూది బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం నుంచి ఫిబ్రవరి 6 వరకు మైనారిటీ గురుకుల వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పాఠశాలల్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ప్రకారం విద్యార్థులను ఎంపిక చేస్తామని, ఇంటర్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని వివరించారు. పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 24 నుంచి 30 వరకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 8008133838 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
#Tags