Admissions in Ambedkar University: అంబేడ్కర్ వర్సిటీ దూరవిద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..
ఇంటర్ రెగ్యులర్, దూరవిద్యతోపాటు డిప్లొమా, ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరేందుకు సైతం ఈనెల 15 వరకు గడువు ఉందని తెలిపారు. ఎంఏలో ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ, హిందీతోపాటు ఎమ్మెస్సీలో మ్యాథ్స్, సైకాలజీ సబ్జెక్టులు ఉన్నాయని, పూర్తి వివరాలకు అధ్యయన కేంద్రంతో పాటు 0863–2227950, 73829 29605 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
రేపు పల్నాడులో విద్యా,వైజ్ఞానిక ప్రదర్శన
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనక్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంగళవారం ప్రకాష్‌నగర్‌లోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 2022–23 సంవత్సరంలో అవార్డులకు ఎంపికై న 126 ప్రాజెక్ట్‌లను ప్రదర్శించనున్నట్టు తెలిపారు. అవార్డులకు ఎంపికై న ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఒక్కొక్క విద్యార్థి బ్యాంక్ ఖాతాలలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రూ.10వేలు జమ చేసిందని తెలిపారు. సదరు విద్యార్థులు తమ ప్రాజెక్ట్‌లతో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, గైడ్ టీచర్లకు సూచించారు. వివరాలకు జిల్లా సైన్స్ ఆఫీసర్ ఏ.ఏ.మధుకుమార్ 9032871234ను సంప్రదించాలని తెలిపారు.