AEE & AE Jobs Notification 2022 : భారీగా ఏఈఈ & ఏఈ పోస్టులకు నోటిఫికేషన్లు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
వివిధ విభాగాల్లో ఏఈఈ & ఏఈ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
DAO Grade 2 Syllabus: డీఏఓ గ్రేడ్-2 రాతపరీక్ష సిలబస్ ఇదే.. వీటిపై పట్టు ఉంటే విజయం మీదే..
మొత్తం ఏఈఈ పోస్టుల సంఖ్య: 1540
పోస్టుల వివరాలు ఇలా..:
➤ ఏఈఈ(సివిల్)-పీఆర్-ఆర్‌డీ డిపార్ట్‌మెంట్(మిషన్ భగీరథ)-302
➤ ఏఈఈ(సివిల్)-పీఆర్-ఆర్‌డీ డిపార్ట్‌మెంట్-211
➤ ఏఈఈ(సివిల్)ఎంఏ-యూడీపీహెచ్-147
➤ ఏఈఈ(సివిల్)టీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్-15
➤ ఏఈఈఐ-సీఏడీ డిపార్ట్‌మెంట్-704
➤ ఏఈఈ(మెకానికల్)ఐ-సీఏడీ(జీడబ్ల్యూడీ)-3
➤ ఏఈఈ(సివిల్)టీఆర్-బి-145
➤ ఏఈఈ(ఎలక్ట్రికల్)టీఆర్-బి-13.
అర్హతలు ఇవే:
పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ(సివిల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/అగ్రికల్చర్ ఇంజనీరింగ్) తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
➤ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 22.09.2022
➤ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.10.2022
➤ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
➤ ఈ ఉద్యోగాలకు శాలరీ : రూ.54220- 133630 వరకు ఉంటుంది.
అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు :
మొత్తం పోస్టుల సంఖ్య: 833
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ ఇంజనీర్ : 434
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ : 399.
విభాగాలు :
పంచాయతీరాజ్, మున్సిపల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్ తదితరాలు.
అర్హతలు ఇవే.. :
అసిస్టెంట్ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా/బీఈ /బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు:
18-44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150 చెల్లిస్తారు.
Competitive Exam Best Success Tips : ఏ పోటీ పరీక్షకైన ఇలా చదివితే ఉపయోగం ఉండదు.. ఇలా చదివితేనే..
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
జీతం : నెలకు రూ.32,810 నుంచి రూ.96,890 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 28.09.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.10.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
Jobs: మహిళా శిశుసంక్షేమ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి