Results: డైట్ ఫస్ట్ సెమిష్టర్ ఫలితాలు విడుదల
Sakshi Education
పార్వతీపురంటౌన్: డైట్ మొదటి సెమిష్టర్ ఫలితా లు విడుదలైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 19, 2023 నుంచి జూన్ 24 వరకు నిర్వహించిన పరీక్షకు 3,885 మంది విద్యార్థులు హాజరుకాగా, 2,480 మంది (63.83 శాతం) ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు కళాశాల సమాచారం కోసం డమ్మీమెమోరాండం కోసం డబ్ల్యూడబ్ల్యూ.బీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఇన్‌ను సంప్రదించాలన్నారు. మార్కుల రీకౌంటింగ్ కోసం ఈ నెల 9వ తేదీలోగా సీఎంఎఫ్‌ఎస్‌లో రూ.500 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Published date : 01 Sep 2023 03:49PM