Distance Education: దూరవిద్య డిగ్రీ ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్యా కేంద్రం ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన డిగ్రీ బీఏ, బీకాం ,బీఎస్సీ, బీబీఏ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ పరీక్షల ఫలితాలను బుధవారం కేయూ వీసీ తాటికొండ రమేష్, రిజిస్ట్రార్ టి.శ్రీనివాస్‌రావు విడుదల చేశారు. ఫస్టియర్ పరీక్షలకు 3,456 మంది విద్యార్థులు హాజరుకాగా.. 1,556మంది, సెకండియర్ 3,831 మందికి 1,850 మంది, ఫైనల్ ఇయర్‌లో 5,099 మందికి 2,280 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కేయూ పరీక్షల నియంత్రణాధికారి పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ ఎ.నరేందర్, డాక్టర్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. కాగా ఫలితాలను కాకతీయ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రీవాల్యూయేషన్‌కు బుధవారం నుంచి 10 రోజుల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ నరేందర్ తెలిపారు.
చదవండి: jobs for unemployed youth: యువతకు 1.80 లక్షల ఉద్యోగాలు ఎక్కడంటే..