Indian students: వైద్య విద్యార్థులకు శుభవార్త.. కీలక పరీక్ష ఆన్‌లైన్‌లో రాసేందుకు ఉక్రెయిన్ అనుమతి
ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు భారతదేశం నుంచే కీలక పరీక్ష రాసుకునేందుకు అనుమతివ్వనున్నట్లు మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఆ దేశ మొదటి ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా హామీ ఇచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
2022 ఫిబ్రవరిలో రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న 19 వేల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లిన 2 వేల మంది విద్యార్థులు యుద్ధ ప్రభావం అంతగా లేని పశ్చిమ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మిగతా వారందరూ ఆన్‌లైన్‌లోనే తరగతులకు హాజరయ్యారు. ఇప్పుడు వారంతా కీలకమైన ఏకీకృత రాష్ట్ర అర్హత పరీక్ష(యూనిఫైడ్ స్టేట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్)కు ఆన్‌లైన్‌లోనే హాజరయ్యేందుకు ఉక్రెయిన్ అనుమతించనుంది.
Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!