MBBS : స్టేట్ ఫస్ట్ ర్యాంక్ .. ఎంబీబీఎస్ ఫైనల్ ఫలితాల్లో టాప్‌లో నమ్రత..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తాజాగా విడుదల చేసిన ఎంబీబీఎస్ ఫైనలియర్ ఫలితాల్లో కర్నూలు మెడికల్ కాలేజీ విద్యార్థిని పి.నమ్రత రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
ఆమెతో పాటు ఎం.యదునందన్, టి.కీర్తన, చిన్నవెంకటసాయి వంశీకృష్ణ, సి.సాయితరుణ్ డిస్టింక్షన్ సాధించారు.
వీరిలో నమ్రత 900 మార్కులకు గాను 752 మార్కులతో స్టేట్ ఫస్ట్‌గా నిలిచారు. అలాగే ఆమె జనరల్ మెడిసిన్ సబ్జక్టులో 300 మార్కులకు గాను 264 మార్కులతో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు. కర్నూలు మెడికల్ కాలేజీలోనూ ఆమె జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ సబ్జక్టుల్లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. ఆమెతో పాటు టి.కీర్తన, సి.సాయివంశీకృష్ణలు సైతం గైనకాలజీ విభాగంలో, ఎం.యదునందన్ పీడియాట్రిక్స్ విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించారు.
Published date : 23 Feb 2023 04:05PM