Skip to main content

Unemployment: నిరుద్యోగం తగ్గుముఖం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో నిరుద్యోగం తగ్గుతోంది. వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే యువతకు ఉపాధిపై దృష్టి సారించారు.
Unemployment
Unemployment: నిరుద్యోగం తగ్గుముఖం

4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వైద్య రంగంలోనూ పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నారు. వివిధ పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్ ఎకానమీ నివేదిక కూడా రాష్ట్రంలో నిరుద్యోగ రేటు బాగా తగ్గినట్లు స్పష్టం చేసింది. 2016వ సంవత్సరంలో ఈ రేటు 17.9 శాతం ఉండగా గత నెల (అక్టోబర్‌)కు 12 శాతానికి పైగా తగ్గి, 5.4 శాతంగా నమోదైంది. అందులోనూ 2021లో ప్రతి నెలా నిరుద్యోగ రేటు తగ్గుదల గణనీయంగా ఉంది. అక్టోబర్‌లో జాతీయ స్థాయి నిరుద్యోగ రేటు 7.75 శాతంగా ఉంది. అంటే జాతీయ స్థాయికంటే రాష్ట్రంలో 2.35 శాతం తక్కువగా ఉంది. తెలంగాణలో అక్టోబర్‌ నాటికి నిరుద్యోగ రేటు 4.2 శాతంగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. తెలంగాణలో 2016 జనవరిలో నిరుద్యోగ రేటు 7.4 శాతంగా ఉందని తెలిపింది.

అగ్రస్థానంలో హరియాణా

నిరుద్యోగంలో హరియాణా అగ్రస్థానంలో నిలిచింది. నిరుద్యోగ రేటు ఎక్కువ శాతం నమోదైన రాష్ట్రాల్లో హరియాణా(30.7%), రాజస్థాన్‌(29.6%), జమ్మూకశ్మీర్‌ (22.2 %), ఝార్ఖండ్‌ (18.1%), హిమాచల్‌ప్రదేశ్‌ (14.1%), బిహార్‌ (13.9%), గోవా (11.7%), పంజాబ్‌ (11.4%), ఢిల్లీ (11 %), సిక్కిం (10%), త్రిపుర (9.9 %)లు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది.

రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుదల ఇలా

సంవత్సరం, నెల

నిరుద్యోగ రేటు శాతం

2016 జనవరి

17.9

2021 మే

12.8

2021 జూన్

7.40

2021 జులై

8.70

2021 ఆగస్టు

6.50

2021 సెప్టెంబర్‌

6.30

2021 అక్టోబర్‌

5.40


చదవండి:

EAMCET: ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారు

CM YS Jagan : విద్యారంగంలొ అత్యంత ప్రాధాన్యత వీటికే..

NHAI Recruitment: ఎన్‌హెచ్‌ఏఐలో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Published date : 05 Nov 2021 12:00PM

Photo Stories