Skip to main content

Teacher posts: అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Teacher posts
Teacher posts

సీతంపేట: స్థానిక డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ శ్యామ్‌బాబు గు రువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్‌, పీడీ, గణితం, జువాలజీ, లైబ్రరీ సైన్సు పోస్టు లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థు లు ఈనెల 18వ తేదీలోగా అప్లై చేసుకోవాలన్నారు. పీజీలో 55 శాతం మార్కులు ఉండాలన్నారు. పీహెచ్‌డీ, నెట్‌, స్లెట్‌ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఈ నెల 21న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, వివరాల కు సెల్‌:8247792846 నంబర్‌కు ఫోన్‌ చేయా లన్నారు.

Published date : 15 Sep 2023 07:33PM

Photo Stories