Skip to main content

Multimedia Admissions: మల్టిమీడియాలో దరఖాస్తుల ఆహ్వానం

Multimedia Admissions,Veeragatha 3.0 Competition,Online Application Announcement
Multimedia Admissions

హవేళిఘణాపూర్‌(మెదక్‌): కేంద్ర మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీరగాథ 3.0 పోటీలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి, ప్రొఫెసర్‌ రాధాకిషన్‌ తెలిపారు. 3, 4, 5 తరగతులు, 6 నుంచి 8వ తరగతి, 9 నుంచి 10వ తరగతి, 11–12 తరగతుల విద్యార్థులకు నాలుగు విభాగాలుగా విభజించి పద్యాలు, చిత్రలేఖనం, వ్యాసరచన, మల్టిమీడియా ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వతంత్య్ర సమరయోధులు, దేశ రక్షణలో భాగస్వాములైన వారి త్యాగాలు జీవిత చరిత్రల తదితర అంశాలపై ప్రతిభను చాటవచ్చన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఉత్తమమైన వాటిలో మంది విద్యార్థులకు రూ.పది వేల చొప్పున నగదు బహుమతిని అందజేస్తారన్నారు. పూర్తి వివరాలకు 83285 99157 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Published date : 21 Sep 2023 12:27PM

Photo Stories