Skip to main content

Mega Job Mela: 8న బొబ్బిలిలో మెగా జాబ్‌ మేళా

AP State Skill Development Institute Organizes Job Fair in Bobbili  Mega Job Fair in Bobbili on 8th  Mega job mela   AP State Skill Development Institute Hosts Job Fair in Bobbili

బొబ్బిలి: ఏపీ స్టేట్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8న బొబ్బిలిలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు ప్లేస్‌మెంట్స్‌ జిల్లా అధికారి టి. భాస్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమో, బీటెక్‌, ఐటీఐ తదితర కోర్సులు చదివిన నిరుద్యో గులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 13 మల్టీ నేషనల్‌ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని బొబ్బిలిలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు. వివరాలకు సెల్‌: 79898 26953, 87905 00572, నంబర్లను సంప్రదించాలని కోరారు.

☛ Software Jobs: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..

Published date : 07 Dec 2023 09:02AM

Photo Stories