Skip to main content

108లో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

షాద్‌నగర్‌: 108 వాహనాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రాం జిల్లా మేనేజర్‌ రమేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
jobs in 108
jobs in 108

ఈఎంఆర్‌ఐ సంస్థలో పెలెట్స్‌, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌గా జిల్లాలో పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 23, 24 తేదీల్లో హయత్‌నగర్‌లోని 108 కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Also read: APPSC గ్రూప్‌-1 2023 ఫ‌లితాలు: టాప్‌–6 మహిళా అభ్యర్థులు వీరే..

పైలెట్స్‌కు ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత, బ్యాడ్జ్‌ డ్రైవింగ్‌ లేదా హెవీ లైసెన్స్‌తో రెండేళ్ల అనుభవం ఉండాలని, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌కు బీఎస్సీ, లేదా లైఫ్‌ సైన్స్‌ గ్రూపు, బీఎస్సీ ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల జీరాక్స్‌లను తీసుకురావాలని కోరారు. మరింత సమాచారం కోసం 91542 48818 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Also read: AP Students Chosen for United Nations Forum Meet | CM YS Jagan | #sakshieducation

Published date : 23 Aug 2023 07:34PM

Photo Stories