Skip to main content

Job Mela: 5న జాబ్‌మేళా.. నెలకు రూ.20 వేల వరకూ జీతం

కాకినాడ సిటీ: వికాస కార్యాలయంలో ఈ నెల 5న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు శుక్రవారం తెలిపారు.
job mela at kakinada on 5th  Job opportunities in Kakinada   Career event alert    Job Fair Announcement in Kakinada City

వరుణ్‌ మోటార్స్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, టెక్నీషియన్‌, డ్రైవర్లు, బజాజ్‌ క్యాపిటల్‌లో ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌, సర్వే డిపార్టుమెంట్‌, టెలికాలర్స్‌, కేఎఫ్‌సీలో టీమ్‌ మెంబర్లు, ఇండో ఎంఐఎం కంపెనీలో టెక్నీషియన్‌, సీఐఈ ఆటోమోటివ్‌లో టెక్నీషియన్‌, డెక్కన్‌ కెమికల్స్‌లో ట్రైనీ ప్రొడక్షన్‌ పోస్టుల భర్తీకి ఈ మేళా నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ ఉద్యోగాలకు టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ ఉత్తీర్ణులైన 30 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకూ జీతం, ఉద్యోగాన్ని బట్టి ఇన్సెంటివ్‌లు, భోజనం, రవాణా సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే, డీడీయూజీకేవై స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశం కల్పించనున్నారని లచ్చారావు తెలిపారు.

చదవండి: Job mela: జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోండి

Published date : 05 Feb 2024 08:33AM

Photo Stories