Skip to main content

Job Mela: 12న జాబ్‌ మేళా

Job Mela in Hyderabad Job Fair at Apollo Pharmacy Hyderabad  Apollo Pharmacy Job Fair    Career Opportunities Await at Apollo Pharmacy

జనగామ రూరల్‌: అపోలో ఫార్మసీ హైదరాబాద్‌ ఆధ్వర్యాన వివిధ విభాగాల్లో 225 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఈనెల 12న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి ఉమారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసిస్ట్‌, ట్రెయినీ ఫార్మసిస్ట్‌, అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌, ప్రొడక్ట్‌ అడ్వటైజర్‌ పోస్టులు ఉన్నాయని, పదో తరగతి, ఇంటర్‌, డి–ఫార్మసీ, బి–ఫార్మసీ ఎం–ఫార్మసీ చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు సంబంధిత సర్టిఫికెట్లతో కలెక్టరేట్‌లోని ఉపాధి కార్యాలయానికి రావాలని, మరిన్ని వివరాలకు 799 543 0401 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలి
రఘునాథపల్లి: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని డీఈఓ రాము అన్నారు. మండల పరిధి కోమళ్ల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతుల బోధన, అభ్యసన కృత్యాలను పరిశీలించిన అనంతరం కాంప్లెక్స్‌ సమావేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశా రు. ఆయన వెంట డీసీఈబీ కార్యదర్శి చంద్రబాను, సహాయ కార్యదర్శి మెరుగు రామరా జు, రిసోర్స్‌ పర్సన్‌ రామ్మూర్తి ఉన్నారు.

నిట్‌లో ‘ఇస్టామ్‌’ సదస్సు
కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లోని అంబేడ్క ర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో గురువా రం ఇస్టామ్‌ (ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ థియరి టికల్‌ అండ్‌ అప్లైడ్‌ మెకానిక్స్‌) రెండు రోజుల 68వ సదస్సును అట్టహాసంగా ప్రారంభమైంది. దీప్‌ ఓషన్‌ మిషన్‌ ప్రాజెక్టు, నేషనల్‌ సెంట ర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ.రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ, ఇస్టామ్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌కుమార్‌, సెక్రటరీ జోజెఫ్‌, డేవిడ్‌ లారోజ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
 

Published date : 09 Dec 2023 10:45AM

Photo Stories