Skip to main content

31న వికాసలో జాబ్‌ మేళా

కాకినాడ సిటీ: వికాస కార్యాలయంలో ఈనెల 31న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రాజెక్డు డైరెక్టర్‌ కె.లచ్చారావు శుక్రవారం తెలిపారు.
job mela
job mela

వరు ణ్‌ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ (సేల్స్‌), కంప్యూటర్‌ ఆపరేటర్‌, టె క్నీషియన్‌, ఎగ్జిక్యూటీవ్‌, సిట్‌ (ఐసీఐసీఐ) బ్యాంక్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌, డెక్కన్‌ కెమికల్స్‌ కంపెనీలో ట్రైనీ, ఇసుజు మోటార్స్‌, డిక్సాన్‌ కంపెనీ ల్లో టెక్నీషియన్‌, కొటక్‌ మహేంద్రా లైఫ్‌ ఇన్సూ రెన్స్‌లో బిజినెస్‌ అసోసియేషన్‌ పార్ట్‌నర్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నా రు. డీడీయూజీకేవై స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ట్రైనింగ్‌ ఇచ్చి ఉద్యోగం కల్పించనున్నారు. పై ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటిఐ,డిప్లామో, డిగ్రీ, బిటెక్‌, ఉత్తీర్ణులైన 35 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు 12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్‌, భోజనం వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులందరూ సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలోని వికాస కార్యాలయం వద్ద ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్స్‌ జెరాక్స్‌లతో హాజరు కావచ్చని పీడీ వివరించారు.

కంట్రోల్‌ యూనిట్ల తరలింపు

కాకినాడ సిటీ: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా ఈవీఎం, వీవీ ప్యాట్‌ గోదాము నుంచి ఈవీఎంలకు సంబంధించిన 1250 కంట్రోల్‌ యూనిట్లు పార్వతీపురం మన్యం జిల్లాకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పోలీస్‌ బందోబస్తుతో తరలించినట్లు ఆర్డీవో ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ పరిశీలనలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, గదుల సాయిబాబా, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఫుట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు 31కి వాయిదా

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29న జరగాల్సిన సబ్‌ జూనియర్స్‌ బాలురు, బాలికల ఫుట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు 31వ తేదీకి వాయిదా పడ్డాయి. వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంఘ కోశాధికారి కోరుమిల్లి శ్రీనివాస్‌ శుక్రవారం తెలిపారు. స్థానిక డీఎస్‌ఏ క్రీడా మైదానంలో ఉదయం 9 నుంచి 5 వరకు ఎంపికలు జరుగుతాయన్నారు.

అప్పనపల్లి ప్రయాణం వాయిదా వేసుకోండి

మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ధర్మకర్తల మండలి చైర్మన్‌ చిట్టూరి రామకృష్ణ, ఈఓ గ్రంధి మాధవి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. గోదావరి వరద ఉధృతితో ఆలయానికి వచ్చే రహదారులు జలదిగ్బంధంలో ఉన్నాయని తెలిపారు. వరద తగ్గేంత వరకూ భక్తులు సహకరించాలని కోరారు.

రైలులో హార్ట్‌ ఎటాక్‌: కాపాడిన 108 సిబ్బంది

తుని: ట్రైన్‌లో గుండె నొప్పి (హార్ట్‌ ఎటాక్‌) వచ్చిన ఓ ప్రయాణికుడిని 108 సిబ్బంది కాపాడారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న శ్రావణ్‌కుమార్‌ (45) అనే ప్రయాణికుడికి గుండెనొప్పి వచ్చింది. సమాచా రం అందుకున్న పాయకరావుపేట 108 సిబ్బంది ట్రైన్‌ కంటే ముందే తుని రైల్వేస్టేషన్‌కు చేరుకుని శావణ్‌కుమార్‌ను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తక్షణమే వైద్యులు స్పందించి సరైన వైద్యం అందించడంతో శ్రావణ్‌కుమార్‌ సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడ్డారు. సమాచారం అందిన వెంటనే స్పందించిన 108 పైలట్‌ రాము, ఈఎంటీ చంద్రమౌళిని స్థానికులు, పేషెంట్‌ కుటుంబ సభ్యులు అభినందించారు.

టెండర్ల ఆహ్వానం

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు 2023 – 24 సంవత్సరానికి కందిపప్పు, మినపప్పు, నూనె మొదలగు వంట సరకులు, గుడ్డు, చికెన్‌ సరఫ రా చేయడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నారు.

Published date : 29 Jul 2023 03:23PM

Photo Stories