Skip to main content

Job Fair in ITI: ఐటీఐలో జాబ్‌మేళా

Job fair in ITI
Job fair in ITI

నెల్లూరు (టౌన్‌): వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో జాబ్‌మేళాను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఆటోసెన్స్‌, గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎల్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇన్నోవో సోర్స్‌, రిలయెన్స్‌ స్మార్ట్‌, అపోలో ఫార్మసీ, వెర్‌మైరెన్‌, ఎన్నెస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, అమర్‌రాజా బ్యాటరీస్‌, తదితర కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. జాబ్‌ మేళాకు 348 మంది హాజరుకాగా, 152 మందిని ఎంపిక చేశారని కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి అధికారి విజయ్‌వినీల్‌కుమార్‌, జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Published date : 12 Aug 2023 06:55PM

Photo Stories