Skip to main content

Job fair: జాబ్‌మేళా సద్వినియోగం చేసుకోండి

AD Srinivas Urges Chittoor Residents to Attend Job Mela, Job fair,Chittoor District Diverse Talents Department Job Fair, AD Srinivas Encourages Diverse Talents at Job Mela
Job fair

చిత్తూరు కలెక్టరేట్‌: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని విభిన్నప్రతిభావంతులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాస్‌ అన్నారు. ఆయన సోమ వారం విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్‌వీయూ ఎంప్లాయీమెంట్‌ ఆఫీస్‌ కాంపౌండ్‌ వద్ద ఈ నెల 11వ తేదీన జాబ్‌మే ళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేళాలో పాల్గొనే వారు పదో తరగతి ఉత్తీర్ణత చెంది, 18–30 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. బధిరులు, అంధులు, శారీరక దివ్యాంగులు పాల్గొనవచ్చన్నారు. ఇతర వివరాలకు 93929 23884 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Published date : 11 Oct 2023 08:21AM

Photo Stories