Skip to main content

Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

free training in tailoring   Tailoring training program starts on the 27th at Canara Bank's initiative.
free training in tailoring

కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ నుంచి నెలరోజులు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

శిక్షణకు 18–45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. గ్రామీణ మహిళలకు ప్రాధాన్యత ఇస్తారన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారని, ఇతర వివరాలకు 94409 05478, 99856 06866 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Published date : 21 Dec 2023 07:58AM

Photo Stories