Skip to main content

Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

Free training in tailoring
Free training in tailoring

ఆర్జీ–3 ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో అందిస్తున్న పలు ఉచిత వృత్తి శిక్షణ తరగతులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సేవా ఆధ్యక్షురాలు ఎన్‌.అలివేణిసుధాకర్‌రావు అన్నారు.

సెంటనరీకాలనీలోని సేవా భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత వృత్తి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలో టైలరింగ్‌, మగ్గం వర్క్స్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, జ్యూట్‌ బ్యాగ్‌ల తయారీ, బ్యూటీషియన్‌ వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో పర్సనల్‌ మేనేజర్‌ ముప్పిడి రవీందర్‌రెడ్డి, కోఆర్డినేటింగ్‌ అధికారి గుర్రం శ్రీహరి, సేవా కార్యదర్శి మల్లేశ్వరి, సంయుక్త కార్యదర్శి ఉమాదేవి, రాజమల్లు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 15 Dec 2023 08:42PM

Photo Stories