Skip to main content

టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌, బ్యూటీపార్లర్‌ మేనేజ్‌మెంట్‌, ఎంబ్రాయిడరీ, ప్యాబ్రిక్‌ పెయింటింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నామని సంస్థ డైరెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Free training in tailoring
Free training in tailoring

18–45 సంవత్సరాల వయస్సు కలిగిఉండాలన్నారు. గ్రామీణ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. దూరప్రాంతాల నుంచి వచ్చు వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈఅవకాశాన్ని వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 94409 05478, 63028 33546 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Published date : 08 Aug 2023 08:13PM

Photo Stories