Skip to main content

Free training in skill development: స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఉచిత శిక్షణ

Government's role in creating employment opportunities, as highlighted by Professor K. Venkatasubbaiah.   Free training in skill development courses    Students' Induction Program with a focus on skill development courses.
Free training in skill development courses

ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని జేఎన్‌టీయూ జీవీ వీసీ ప్రొఫెసర్‌ కె.వెంకటసుబ్బయ్య అన్నారు. ఏపీ ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ప్రోత్సాహంతో జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘ఆంధ్రప్రదేశ్‌ డెవలప్‌మెంట్‌ డైలాగ్‌’ అనే అంశపై సోమవారం ప్రారంభమైన స్టూడెంట్స్‌ ఇంట్రాక్షన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధామిస్తోందన్నారు. యువతకు ఉన్నత ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా 2020 నుంచి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తోందన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి మైక్రోసాఫ్ట్‌ అనే సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుందని తెలిపారు.

ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు అనుగుణంగా అడ్వాన్స్‌ కోర్సెస్‌ను నేర్చుకుని ఉత్తమ ప్లేస్మెంట్స్‌ను పొందాలని ఆకాంక్షించారు. జేఎన్‌టీయూ జీవీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి.జయసుమ మాట్లాడుతూ సదస్సుకు హాజరైన రిసోర్స్‌ పర్సన్‌లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రీసోర్స్‌ పర్సన్‌గా డాక్టర్‌ బి.రంగారెడ్డి (ఫిజీషియన్‌ మరియు హానరరీ ప్రొఫెసర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌), ఐఐఎం లక్నో ప్రొఫెసర్‌ ఎస్‌.వెంకటరమణయ్య మట్లాడుతూ లోకల్‌ గవర్నెన్స్‌ గురించి విపులంగా తెలియజేశారు. స్వాతంత్య్రం రాకముందే మహాత్మా గాంధీ లోకల్‌ గవర్నెన్స్‌ గురించి తెలియజేశారని, ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం, పాదర్శకత చాలా ముఖ్యమైన అంశాలని తెలిపారు. సమావేశంలో నోడల్‌ అధికారి డాక్టర్‌ జీజే నాగరాజు, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Published date : 31 Jan 2024 08:10AM

Photo Stories