Free training on bike repair: బైక్ రిపేరీపై ఉచిత శిక్షణ
Sakshi Education
అనంతపురం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల మరమ్మతుపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి బుధవారం ఓ ప్రకటన జారీ చేశారు. 45 రోజుల పాటు సాగే శిక్షణా కార్యక్రమంలో స్పోకెన్ ఇంగ్లిష్, కస్టమర్లతో వ్యవహరించే తీరు, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పిస్తారు. పదో తరగతి పాస్/ఫెయిల్, ఐటీఐ పాస్/ఫెయిల్ అయి, 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వయసున్న వారు అర్హులు. శిక్షణా కాలంలో మధ్యాహ్నం భోజనం అందజేస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా టూల్‌కిట్, సర్టిఫికెట్ మంజూరు చేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ కల్పిస్తారు. పూర్తి వివరాలకు 93905 05952, 77807 52418లో సంప్రదించవచ్చు.
Published date : 08 Sep 2023 07:45AM
Tags
- Education News
- Free training on bike repair
- Free training
- news for jobs
- Latest News in Telugu
- Telugu News
- Today News
- news today
- news telugu
- news app
- Breaking news
- telugu breaking news
- news bulletin
- news daily
- news for today
- news today ap
- Telangana News
- andhra pradesh news
- Google News
- Aanantapur distric news
- Sakshi Education Latest News