Skip to main content

Free Coaching for Group 2 Exams: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

Kurnool Director Announces Free Coaching for Group-2 Exam  Free Coaching for Group 2 Exams  Applications Open for Group-2 Preliminary Exam Coaching
Free Coaching for Group 2 Exams

గ్రూప్‌–2 ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ పొందేందుకు అర్హులైన డిగ్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారిణి లక్ష్మీదేవమ్మ, ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌ కర్నూలు డైరెక్టర్‌ వెంకటలక్ష్మమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు అర్హులని, దరఖాస్తులను ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌ కల్లూరు, తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా అబ్బాస్‌ నగర్‌, కర్నూలుకు ఈ నెల 26వ తేదీ లోగా స్వయంగా, పోస్టు ద్వారా పంపాలన్నారు.

45 రోజుల ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక డిగ్రీ మెరిట్‌ ప్రాతిపదికన జరుగుతుందన్నారు. ఉచిత స్టడీ మెటీరియల్‌ను అందజేస్తామన్నారు. శిక్షణా కాలం పూర్తయిన తర్వాత అర్హులైన అభ్యర్థులకు స్టైఫండ్‌ మంజూరవుతుందన్నారు. ఇతర వివరాలకు 08518 236076ను సంప్రదించాలన్నారు.

Published date : 20 Dec 2023 07:41AM

Photo Stories