Free coaching fashion design course: ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియాలోని అందిస్తున్న శిక్షణతో నిరుద్యోగ మహిళలు, యువతీ యువకులకు ఉపాధి అవకాశం లభిస్తుందని జీఎం రవిప్రసాద్ అన్నారు. గతేడాది ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో స్వయం ఉపాధి శిక్షణ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి మంగళవారం గోలేటిలోని సీఈఆర్ క్లబ్‌లో రాతపరీక్షలు నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మోటర్ డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న యువత నేడు స్వయం ఉపాధిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులతోపాటు వారి కుటుంబాల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి పని చేస్తుందన్నారు. సింగరేణి సేవా సమితి చీఫ్ కోఆర్డినేటర్ శివకుమార్, కేజీఎంవీ అధికారి బానోత్ నరేశ్, డీవైపీఎం రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ పీవో ప్రశాంత్, శిక్షకులు రూప, లక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Tags
- Education News
- Latest News in Telugu
- Free coaching fashion design course
- Free Coaching
- Fashion Designing
- Telugu News
- Today News
- news today
- news telugu
- news app
- Breaking news
- telugu breaking news
- news bulletin
- news daily
- news for today
- news for jobs
- news today ap
- andhra pradesh news
- Google News
- bellempally news
- Sakshi Education Latest News
- Singareni