Skip to main content

AP Govt Jobs: 170 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Directorate of Medical Education (DME) Job Vacancies   State Medical Department Opportunities   Assistant Professor Jobs in the medical department   AP Medical Services Recruitment Board Notification

సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య శాఖలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) పరిధిలో ఉండే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 144, విశాఖపట్నంలోని విమ్స్‌లో 26 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్‌ సర్విసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా  శాశ్వత, కాంట్రాక్ట్‌ పద్ధతుల్లో పోస్టుల భర్తీ చేయనున్నట్టు బోర్డ్‌ మెంబర్‌ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

బోధనాస్పత్రుల్లో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 144 పోస్టుల్ని శాశ్వత ప్రాతిపదికన (డైరెక్ట్‌/లేటరల్‌) భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఈనెల 18, 20 తేదీల్లో విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్‌ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తారు.

చ‌ద‌వండి: APPSC Group 1 Notification: నిరుద్యోగులకు మరో శుభవార్త

ఇక విమ్స్‌లో 26 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేయడం కోసం ఈనెల 15న విశాఖపట్నంలోని విమ్స్‌లోనే వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆయా తేదీల్లో ని ర్ణీత ప్రదేశాలకు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది.  అర్హత, ఇతర నియమనిబంధనలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్‌ను https://dme.ap.nic.in  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

వైద్యపోస్టుల భర్తీకి బిడ్డింగ్‌ 
తమ పరిధిలోని ఆస్పత్రుల్లో శాశ్వత, కాంట్రాక్టు విధానంలో స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకానికి వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌తో పాటు గిరిజన ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యుల ఖాళీలను బిడ్డింగ్‌ విధానంలో అధిక వేతనంతో నియమించేందుకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ అధికారులు శుక్రవారం ప్రకటించారు.

చ‌ద‌వండి: Employment Training: ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోండి

ఖాళీల భర్తీకి ఈ నెల 11వ తేదీ నుంచి తాడేపల్లిలోని డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కార్యాలయంలో వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించనున్నారు. బిడ్డింగ్‌ విధానంలో నియామకానికి ఆసక్తి చూపే వైద్యులు నిర్ణీత తేదీల్లో వాకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ వేదిక వద్ద తమ కొటేషన్లను సీల్డ్‌ కవర్లో ఇవ్వాలని సూచించారు. ఈ విధానానికి సంబంధించిన సవరించిన నోటిఫికేషన్‌ cfw.ap.gov.in, hmfw.ap.gov.in వెబ్‌సైట్లలో ఉంచారు. 

Published date : 11 Dec 2023 10:58AM

Photo Stories