Employment Training: ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోండి
రంపచోడవరం: పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అందిస్తున్న ఉపాధి శిక్షణ కార్యక్రమాలను గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలని కేవీకే కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్. లలితాకామేశ్వరి అన్నారు. చేపలు, రొయ్యల విలువ ఆధారిత ఉత్పత్తులపై కేవీకేలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏటా గిరిజన యువత జీవనోపాధి మెరుగుపరిచేందుకు వివిధ రకాల శిక్షణ ఇస్తున్నమన్నారు. చేపలు,రొయ్యలతో విలువధారిత ఉత్పత్తుల తయారీపై ఇప్పటికే మూడు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చామన్నారు. మహిళలు ఇంటి వద్దే చేపలు, రొయ్యలతో పచ్చళ్లు తయారీ చేసి మార్కెట్ చేసుకోవచ్చన్నారు. మత్స్యశాఖ శాస్త్రవేత్త డా. వీరాంజనేయులు మాట్లాడుతూ చేపలు, రొయ్యలతో తొమ్మిది రకాల పచ్చళ్లు, కట్‌లెట్‌లు, జంతికలు, అప్పడాలు, వడియాల తయారీపై గిరిజన ఉప ప్రణాళిక నిధులతో శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 40 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.
చదవండి: APPSC Group 1 Notification: నిరుద్యోగులకు మరో శుభవార్త