Skip to main content

ISRO Company: విద్యార్థల శాస్త్ర, సాంకేతిక విజ్ఞానానికి యువికా

విద్యార్థులు వారికి ఉన్న శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని మరింత మెరుపరిచేందుకు ఈ యువికా కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు జిల్లా సైన్స్‌ అధికారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనేందుకు దరఖాస్తులు చేసుకునే విధానాన్ని వివరించారు..
Dr. Mainam Hussain speaking to students about the Yuvika program   Engaging students in science education through ISROs Yuvika program.   Yuvika Program under ISRO for students talent in Science and Technology

పాయకాపురం: ఇస్రో సంస్థ విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని పెంచేందుకు కృషి చేస్తోందని జిల్లా సైన్స్‌ అధికారి డాక్టర్‌ మైనం హుస్సేన్‌ తెలిపారు. ఇందుకోసం 9వ తరగతి విద్యార్థుల కోసం ‘యువికా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్‌ హైస్కూల్‌ విద్యార్థులకు సోమవారం ‘యువికా’ కార్యక్రమంపై ఆయన అవగాహన కల్పించారు.

Kakatiya University: మార్చి 21 నుంచి బీఈడీ పరీక్షలు

ఈ సందర్భంగా హుస్సేన్‌ మాట్లాడుతూ రాకెట్లు, శాటిలైట్లు, స్పేస్‌ సైన్స్‌పై విద్యార్థులకు అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. మే 13 నుంచి 24వ తేదీ వరకు ఇస్రో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు ఈనెల 20వ తేదీ లోపు వారి వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకు న్నవారు ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కులు, తొమ్మిదో తరగతిలో ఎన్సీపీ, ఎన్జీపీ ప్రోగ్రాంల్లో పాల్గొని సాధించిన అవార్డుల ఆధారంగా విద్యార్థులకు ప్రాథమికంగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారన్నారు.

Food Manufacturers: ఆహార పదార్ధాల తయారీదారులకు అవగాహన కార్యక్రమం

ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఉచితంగా శిక్షణ ఇస్తారని తెలిపారు. జిల్లాలోని తొమ్మిదో తరగతి విద్యార్థులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ శాస్త్ర సాంకేతిక సంబంధమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తిగలవారు https://jigyasa.lirs.gov.in/uvika అనే వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Published date : 19 Mar 2024 03:08PM

Photo Stories