Worlds Largest Childrens Museum: ప్రపంచంలోనే అతిపెద్ద బాలల మ్యూజియం!
Sakshi Education
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బాలల మ్యూజియం. అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో ఉంది. మేరీ స్టూవర్ట్ కారే అనే సంపన్న వ్యాపారవేత్త 1924లో బ్రూక్లిన్ బాలల మ్యూజియం చూశారు. దాని ప్రేరణతోనే ఆమె ఇండియానాపోలిస్‌లో స్థానిక దాతల సహకారంతో 1925లో ఈ మ్యూజియంను నెలకొల్పారు. దీనిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో 1946లో కొత్త నిర్మాణం చేపట్టి ప్రస్తుతం ఉన్న చోటికి తరలించారు.
చదవండి: Childrens: పిల్లల్లో కూడా యాంగ్టయిటీ డిజార్డర్స్ ఉంటాయా?
దాదాపు 4.73 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో పిల్లల వినోద విజ్ఞానాలకు పనికొచ్చే బోలెడన్ని వస్తువులు ఉన్నాయి. వివిధ దేశాలకు చెందిన పురాతనమైన ఆటవస్తువులు ఉన్నాయి. ఈ మ్యూజియంకు ఏటా దాదాపు పదిలక్షల మందికి పైగానే సందర్శకులు వస్తుంటారు.
Published date : 13 Nov 2023 03:54PM