Skip to main content

Govt Degree College: డిగ్రీ విద్యార్థులకు చదరంగం పోటీలు

world chess day celebration in govt degree college

అరకులోయ: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ చెస్‌ దినోత్సవాన్ని జులై 20 గురువారం ఘనంగా నిర్వహించారు. ఇక్కడ డిగ్రీ విద్యార్థులకు చెస్‌ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సి.హెచ్‌. రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చెస్‌లో రాణిస్తే వారిలో మేధాశక్తి పెరుగుతుందన్నారు. చదరంగం ద్వారా ఆటగాడికి సృజనాత్మకత, ఏకాగ్రత, ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ పద్మలత, క్రీడా విభాగం ఇన్‌చార్జి నాగబాబు, పీడీ ఎస్‌.అప్పారావు, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో విజయలక్ష్మి, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
 

Published date : 21 Jul 2023 05:21PM

Photo Stories