Skip to main content

Exams Postponed: కేయూ పరిధిలోని నేటి పరీక్షలు వాయిదా

Today's under kakatiya university exam postponed

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, అదిలాబాద్‌ జిల్లాలో జులై 22న నిర్వహించాల్సిన పలు పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ రాధిక తెలిపారు. బీ ఫార్మసీ 8వ సెమిస్టర్‌, ఫార్మాడి నాల్గవ సెమిస్టర్‌, బీటెక్‌ ఫస్టియర్‌ అలాగే బీపార్మసీ నాన్‌ సీబీసీఎస్‌ నాల్గవ, మొదటి సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేశామని తెలిపారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పటికే జులై 20, 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం విదితమే. వాయిదా పడిన పరీక్షల రీషెడ్యూల్‌ను శనివారం విడుదల చేస్తామని వారు తెలిపారు.

Guest Lecturer Posts: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Published date : 22 Jul 2023 05:55PM

Photo Stories