Students: డీఏవీ ‘భారతి’ విద్యార్థుల ప్రతిభ
కమలాపురం : మండలంలోని నల్లింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) లోని డీఏవీ భారతి విద్యార్థులు ఇంటర్నేషనల్ ఒలంపియాడ్‌లో విజయ కేతనం ఎగుర వేశారు. ఈ ఏడాదిలో సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ పోటీల్లో పాల్గొన్న డీఏవీ భారతి విద్యార్థులు ప్రతిభ కనబరిచి జోనల్ స్థాయిలో 7, రాష్ట్ర స్థాయిలో 12 మంది విద్యార్థులు విజయ కేతనం ఎగుర వేశారు. అలాగే తరగతుల వారీగా నిర్వహించిన పోటీల్లో 18 మంది బంగారు, 20 మంది వెండి, 16 మంది సిల్వర్ పతకాలు సాధించారు. కాగా మంగళవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పరిశ్రమ ప్రతినిధులు సుబ్బలక్ష్మి సాయి రమేష్ (కోర్ అడ్వైజర్), చీఫ్ మేనేజరన్ అడ్మిన్ వేణుగోపాల్, ప్రిన్సిపల్ శివ్వాం కిషోర్ కుమార్‌లు విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పోటీలో ఇలాగే విజయం సాధించాలని విజేతలకు సూచించారు. కాగా ప్లాంట్ సీఎంఓ సాయి రమేష్, డీఏవీ సౌత్ జోన్ ప్రాంతీయ అధికారి వీఎన్‌ఎన్‌కే శేషాద్రి విద్యార్థులను, ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు.
చదవండి: VC: కోర్సుల్లో కొత్త సిలబస్.. ఉద్యోగ అవకాశాలు లభించేలా..