Skip to main content

Schools Holiday: 1న పాఠశాలలు బంద్‌

భువనగిరి టౌన్‌ : జూలై 1న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి జూన్ 29న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Schools Holiday
జూలై 1న పాఠశాలలు బంద్‌

జిల్లాలోని 70 పాఠశాలల్లో గ్రూప్‌–4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండ: ఉమ్మడి జిల్లాలోని బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా విధులు నిర్వహించేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రాంతీయ సమన్వయ అధికారి షకీనా జూన్ 29న‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నల్లగొండలోని ఆర్‌సీఓ కార్యాలయంలో జూలై 6వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని నాగార్జునసాగర్‌, సూర్యాపేట, యాదాద్రి భువనగిరిలోని గురుకులాల్లో ఇంగ్లిష్‌, తెలుగు, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, కామర్స్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ తదితర సబ్సెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నాని తెలిపారు. పీహెచ్‌డీ, సెట్‌, నెట్‌ అర్హత కలిగిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 08682224566 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

చదవండి:

TSPSC Group IV Exam: 2,878 పరీక్ష కేంద్రాలు... 39,600 మంది ఇన్విజిలేటర్లు.. టీఎస్‌పీఎస్సీ సూచనలు ఇవే

Engineering: కౌన్సెలింగ్‌లో తగ్గిన సీట్లు.. ఆ సీట్లు ఏమైనట్టు?

NCERT: 8వ తరగతి సిలబస్‌ తగ్గింపు.. తొలగించిన‌ చాప్టర్లు ఇవే

Published date : 30 Jun 2023 05:31PM

Photo Stories