Sakshi Spell Bee & Math Bee: సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీతో మేధాశక్తి
ఖమ్మంసహకారనగర్: విద్యార్థులో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సాక్షి మీడియా చేస్తున్న కృషి అభినందనీయమని, సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్ బీ పరీక్షలు నైపుణ్యం మెరుగుపర్చుకునేందుకు ఎంతో దోహదపడతాయని రెజొనెన్స్ విద్యాసంస్థల డైరెక్టర్లు ఆర్‌వీ నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్‌రావు వెల్లడించారు.
సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయిలో సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలను నగరంలోని రెజొనెన్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా రెజొనెన్స్ డైరెక్టర్లు ఆర్‌వీ నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్‌రావు మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలు దోహదపడతాయన్నారు. ఇలాంటి పోటీ పరీక్షలను నిర్వహించటం ద్వారా విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగటంతో పాటు మరిన్ని పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం ఉందన్నారు. సాక్షి మీడియా వివిధ స్థాయిల్లో పరీక్షలను నిర్వహించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. తొలుత పాఠశాల స్థాయిలో పరీక్షలు నిర్వహించగా ప్రతిభ కనబర్చిన వారికి జిల్లా స్థాయిలో పరీక్షలను నిర్వహించారని చెప్పారు. స్పెల్ బీలో ప్రతిభ కనబర్చిన వారు రీజినల్ స్థాయికి వెళ్లనుండగా.. మ్యాథ్ బీలో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్రస్థాయికి వెళ్లనున్నారు.
రెజొనెన్స్ కళాశాలలో జరిగిన పరీక్ష కేంద్రంలో నగరంలోని సర్వజ్ఞ స్కూల్, నిర్మల్ హృదయ్, రెజొనెన్స్ ఇన్ఫో, హార్వెస్ట్, హార్వెస్ట్ స్ప్రింగ్ లీఫ్, మిలీనియం, త్రివేణి, బ్లూమింగ్ మైండ్స్, బీబీఎం, శ్రీరామకృష్ణ విద్యాలయాలు, మధిరకు చెందిన ఠాగూర్ విద్యానికేతన్, భరత్ విద్యానికేతన్, శ్రీనిధి, నారాయణ, సత్తుపల్లికి చెందిన కేకేఆర్ గౌతమ్, కొత్తగూడెంలోని త్రివేణి, భద్రాచలానికి చెందిన సెయింట్ పాల్స్‌లూతరన్ పాఠశాలల విద్యార్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. కాగా బ్రాంచ్ మేనేజర్ మోహన్‌కృష్ణ, ఈవెంట్ ఆర్గనైజర్ వేణు, యాడ్స్ మేనేజర్ శేషు, నందకుమాÆŠḥ, పాషా, సాక్షి సిబ్బంది పరీక్షలను పర్యవేక్షించారు. కార్యక్రమానికి ప్రెజెంటింగ్ స్పాన్సర్ డ్యూక్స్ వ్యాపి, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లు వ్యవహరించాయి.
పరీక్ష రాయటం సంతోషం..
పరీక్ష రాయటం ఎంతో సంతోషాన్నిచ్చింది. పోటీ పరీక్షలు ఏవిధంగా రాయాలనే అంశంపై ఒక అవగాహన వచ్చింది. సాక్షి మీడియా ఆధ్వర్యంలో స్పెల్ బీ పరీక్షను నిర్వహించటం ద్వారా మాకు ఉన్న భయాలు పోయాయి. ఈ పరీక్ష భవిష్యత్‌లో ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది.
– జి.మాన్వి, 5వ తరగతి, సర్వజ్ఞ, ఖమ్మం (స్పెల్ బీ)
పోటీ పరీక్షలకు ఉపయోగం..
సాక్షి మ్యాథ్ బీ పరీక్షను రాయటం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో జరిగే పోటీ పరీక్షలను సులభంగా రాసేందుకు దోహదపడుతుంది. పోటీ పరీక్షలను ఏ విధంగా రాయాలనే అవగాహన వచ్చింది. సాక్షి మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్‌లో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుంది.
– అఫియా కౌజిన్, 2వ తరగతి, మిలీనియం, ఖమ్మం (మ్యాథ్ బీ)
ఆలోచించి రాశాను
మనకు ఉన్న సమయంలో ఆలోచించి రాస్తే సులభంగా రాయగలం. ప్రతి ప్రశ్నను మొదటిగా చదివి అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా సులభంగా జవాబులు రాసే అవకాశం ఉంటుంది. మరిన్ని పరీక్షలు నిర్వహించి నూతనోత్సాహాన్ని తీసుకురావాలి.
– వి.వినేషారెడ్డి, 7వ తరగతి, నిర్మల్ హృదయ్, ఖమ్మం (మ్యాథ్ బీ)