Sainik School Admission 2024: దరఖాస్తుకు చివరి తేదీ...
భువనగిరిటౌన్: 2024– 25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాలలో 6 వ తరగతి, 9వ తరగతుల్లో ప్రవేశానికై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన వెలువరించిందని కలెక్టర్ హనుమంతు కే. జెండగే బుధవారం తెలిపారు. ఆరవ తరగతిలో బాల బాలికల ప్రవేశానికి 31.03. 2024 వరకు 10 నుంచి 12 సంవత్సరాల వయసు ఉండి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. 9వ తరగతిలో బాలబాలికల ప్రవేశానికి 31.03. 2024 వరకు 13 నుంచి 15 సంవత్సరాల వయసు ఉండి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. జనరల్, ఎక్స్ సర్వీస్ మెన్, రక్షణ దళాల్లో పనిచేసే వారు, ఓబీసీ విద్యార్థుల ప్రవేశ పరీక్ష ఫీజు రూ.650, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.500 నిర్ణయించారని పేర్కొన్నారు. https//exams.nta.ac.in/aissee/ వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశపరీక్ష 21.01.2024 వ తేదీన ఓఎంఆర్ పద్ధతిలో ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
Tags
- Sainik School
- admissions
- Sainik School Admission 2024
- Admissions in Sainik School
- National Testing Agency
- 6th class
- 9th Class Admissions
- 6th class admissions
- Education News
- Telangana News
- BhuvanagiriTown
- AdmissionAnnouncement
- KurukondaMilitarySchool
- NationalTestingAgency
- admissions
- sakshi education latest admissions