Adikavi Nannaya University: బీ ఫార్మసీ కోర్సులు.. వెబ్ ఆప్షన్‌కి అవకాశం
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ యూనివర్సిటీ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఫార్మసీ కళాశాలలో బీ ఫార్మసీ చదివేందుకు వెబ్‌ఆప్షన్స్ పెట్టుకోవచ్చని వర్సిటీ వీసీ ఆచార్య కె.పద్మరాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక నన్నయ్య ప్రాంగణంలో ఫార్మసీ కోర్సుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని పేర్కొన్నారు. దీని ద్వారా ఇక్కడ ఫార్మసీ కోర్సులో చేరడానికి విద్యార్థులు వెబ్ ఆప్షన్ పెట్టుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. తమ కళాశాల ప్రాంగంణంలో బీ ఫార్మసీకి నూతన భవనం, అనుభవజ్ఞులైన అధ్యాపకు లు, అధునాతన ల్యాబొరేటరీలు, ఇతర వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈనెల 25 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చని తెలిపారు.
చదవండి: Degree Exams: డిసెంబర్ చివరి వారంలో డిగ్రీ పరీక్షలు
వాలీబాల్ సెలెక్షన్స్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చేనెల 8 నుంచి తిరుపతిలో జరిగే దక్షిణ భారత అంతర్ కళాశాలల వాలీబాల్ పోటీలకు ఆదికవి నన్నయ యూనివర్సిటీ జట్టును స్థానిక సీఆర్‌ఆర్ మహిళా కళాశాలలో ఎంపిక చేశారు. సెలెక్షన్స్ లో భాగంగా పోటీలు నిర్వహించగా జంగారెడ్డిగూడెం సీఎస్‌టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు మొదటి, రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను వర్సిటీ జట్టుకు ఎంపిక చేశారు. జి.ప్రస న్న జ్యోతి (గొల్లల మామిడాడ), పి.గౌతమి (గోపన్నపాలెం), కె.జయశ్రీ (జంగారెడ్డిగూ డెం), జి.హేమదుర్గ (రాజమహేంద్రవరం), పి.రమ్య (తణుకు), పి.రమణి (గోపన్నపాలెం), బి.దిల్లేశ్వరి (జంగారెడ్డిగూడెం), టి.తులసి (గోపన్నపాలెం), వి.ప్రవల్లిక (జంగారెడ్డిగూడెం), యు.నాగదుర్గాభవాని (తణుకు), సీహెచ్ స్నేహ సంతోషి (రంపచోడవరం), వై.భూమిక (తణుకు) జట్టు సభ్యులుగా ఎంపికయ్యారు. స్టాండ్‌బై క్రీడాకారిణులుగా ఎస్.ప్రణీత (ఏలూరు), వి.మేఘన (ఏలూరు), సీహెచ్ రమాదేవి (కొయ్యలగూడెం), పి.తన్మయిశ్రీ (రంపచోడవరం) జట్టుకు ఎంపికయ్యారు. వీరిని సీఆర్‌ఆర్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ పి.శైలజ అభినందించారు. సీఆర్ ఆర్ కళాశాల పీడీ సునీతమ్మ జట్టు సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు.
Tags
- Adikavi Nannaya University
- Pharmacy Courses
- Pharmacy Course Weboptions
- B Pharmacy Course Details
- Education News
- andhra pradesh news
- admissions
- VarsityVC
- AcharyaKPadmaraju
- statements
- WednesdayUpdate
- PharmacyCollege
- TadepalligudemCampus
- NannayaUniversity
- WebOptions
- BPharmacy
- OnlineStudy
- sakshi education latest admissions