NCC Student: రికార్డు సృష్టించిన ఎన్‌సీసీ విద్యార్థిని..
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలకు చెందిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) విద్యార్థిని కల్పన హుబ్లీకర్ చరిత్ర సృష్టించింది. 14వ ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ శ్రీకాకుళం కేంద్రం నుంచి జాతీయస్థాయిలో జరిగే ట్రెక్కింగ్ క్యాంపునకు తన కళాశాల తరఫున ఎంపికైన మొదటి ఎన్‌సీసీ క్యాడెట్‌గా కల్పన హుబ్లీకర్ రికార్డులకు ఎక్కింది. ఈమె డిగ్రీలో బీఎస్సీ (ఎంపీసీఎస్) ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
Tab Usage: ట్యాబ్ వినియోగం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తెలియాలి..
మే నెల మొదటి వారంలో తమిళనాడులోని ఉదక మండలంలో జరిగే ఈ క్యాంపునకు కళాశాల నుంచి ఎన్‌సీసీ క్యాడెట్ కల్పన ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్ డాక్టర్ పి.సురేఖ సంతోషం వ్యక్తంచేశారు. మిగతా మహిళలు, పురుషుల ఎన్‌సీసీ క్యాడెట్లకు కల్పన ప్రేరణగా నిలుస్తుందని ఆమె చెప్పారు. ఇందుకు సహకరించిన కళాశాల ఎన్‌సీసీ అధికారి కెప్టెన్ డా క్టర్ వై.పోలినాయుడును, మహిళా కేర్ టేకర్లు వరలక్ష్మి, పావనిలను ఆమె అభినందించారు. జాతీయ ట్రెక్కింగ్ క్యాంప్‌నకు కల్పన ఎంపికపై కళాశాల అధ్యాపకులు సిబ్బంది అభినందించారు.
Personal Robots: ప్రపంచ నంబర్ వన్ హోమ్ రోబోట్ ప్రాజెక్ట్.. దీని అవకాశాలు, సవాళ్లు ఇవే..!