Skip to main content

Modern Education: పాల్‌ ల్యాబ్స్ తో ఆధునిక విద్యాబోధన

Modern education with Paul Labs

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక విద్యాబోధన అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పాల్‌ ల్యాబ్స్‌కు శ్రీకారం చుట్టినట్లు పాల్‌ ల్యాబ్స్‌ రాష్ట్ర నోడల్‌ అధికారి విజ­య­భాస్కర్‌ పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వ­ర్యంలో రూపొందించిన పర్సనల్‌ అడాప్టివ్‌ లె­ర్నింగ్‌ (పాల్‌) కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు గుంటూరులోని ఏసీ కళాశాల వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఓరియెంటేషన్‌ తరగతులు శుక్రవారం ముగిశాయి.

ఈ సందర్భంగా నోడల్‌ అధికారి విజయభాస్కర్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాల్‌ ల్యాబ్స్‌ మంజూరు చేసిన 60 పాఠశాలల పరిధిలోని ప్రధానోపాధ్యాయులతో పాటు గణిత, సైన్స్‌ ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల మేధస్సుకు మరింత పదును పెట్టాలని చెప్పారు. రాష్ట్ర సమన్వయకర్త కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ పాల్‌ కార్యక్రమ ఉద్దేశం, ప్రధానోపాధ్యాయుల బాధ్యతలను వివరించారు.

చదవండి: UNO International Youth Conference: పటిష్ట విద్యా వ్యవస్థతో యువత ప్రగతి

Published date : 23 Sep 2023 06:02PM

Photo Stories