Skip to main content

National Inspire Manak: జాతీయస్థాయి ‘ఇన్‌స్పైర్‌’కు మెదక్‌ విద్యార్థిని

DEO Radhakishan - District Education Officer,National Inspire Manak,National-level selection,Indira Gandhi Sports Complex in New Delhi

మెదక్‌ కలెక్టరేట్‌: జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ ప్రదర్శనలో జడ్పీహెచ్‌ఎస్‌ నాగ్సాన్‌పల్లి విద్యార్థిని నందిని పాల్గొననున్నుట్లు డీఈఓ రాధాకిషన్‌, జిల్లా సైన్‌న్స్‌ అధికారి రాజిరెడ్డి అక్టోబర్ 8న ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరుగనున్నట్లు తెలిపారు. గత జనవరిలో నిర్మల్‌ పట్టణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో నందిని ప్రదర్శించిన ‘అడ్జస్టబుల్‌ గ్యాస్‌ స్టవ్‌ ఫ్లాట్‌ ఫారం’ ప్రాజెక్ట్‌ జాతీయస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. కాగా రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రశంసాపత్రం అందజేసినట్టు తెలిపారు. అదే స్ఫూర్తితో జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు గుర్తింపు తేవాలని కలెక్టర్‌ రాజర్షిషా ఆకాంక్షించారు.

చ‌ద‌వండి: Constable Jobs 2023 : గుడ్‌న్యూస్‌.. ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తోనే 84,866 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

Published date : 09 Oct 2023 02:51PM

Photo Stories